ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. వీర సింహారెడ్డి. ఈనెల 12న విడుదల కాబోతోంది. నిన్ననే ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించారు. ట్రైలర్ బయటకు వదిలారు. అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇంకా సిద్ధవం కాలేదు. ఆ పనుల్లోనే తమన్ బిజీగా ఉండడం వల్ల... ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేకపోయాడు.
11న ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ కాపీ సైతం సిద్ధం కాలేదు. ఫస్ట్ కాపీ సిద్ధమవ్వాలి, ఆ తరవాత సెన్సార్‌కు పంపాలి.... ఆ తరవాతే.. ఓవర్సీస్‌కు ప్రింట్లు పంపాలి. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. అందుకే వీరసింహారెడ్డి చిత్ర బృందానికి టెన్షన్ మొదలైంది. ఈ సంక్రాంతికి విడుదల కానున్న వారసుడు దీ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకూ ఫస్ట్ కాపీ కూడా రెడీ కాలేదట. 12న విడుదల కావాల్సిన సినిమాని ఒక్క రోజు ముందే అంటే 11న తీసుకొస్తా అని ప్రకటించేశాడు దిల్ రాజు. అయితే.. కాపీ సిద్ధం అవ్వకుండానే ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం గందరగోళానికి తెర లేపింది. అనుకొన్న సమయానికి వీర సింహారెడ్డి, వారసుడు సినిమాలు రెడీ అవుతాయా? లేదా? అనే ఉత్కంఠత మొదలైంది. ఈ సినిమాలతో పోలిస్తే.. `వాల్తేరు వీరయ్య` కొంచెం బెటర్ పొజీషన్లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సెన్సార్ కూడా పూర్తయ్యింది. కాబట్టి.. చిరు సినిమాకి ఈ టెన్షన్ లేనట్టే.