సిగ్గెందుకంటోన్న బాబాయ్‌ - అబ్బాయ్‌

By iQlikMovies - August 03, 2018 - 12:04 PM IST

మరిన్ని వార్తలు

సెలబ్రిటీలు కమర్షియల్‌ యాడ్స్‌లో నటించడం మామూలే. అయితే డోమెక్స్‌ వంటి టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్స్‌కి స్టార్‌ హీరోలు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరించడం అంటే కాస్త విచిత్రంగానే ఉంటుంది. అందుకే ఆ యాడ్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఇంతకీ ఆ యాడ్‌లో నటించిందెవరంటారా? విక్టరీ వెంకటేష్‌, రానా. ఈ ఇద్దరు బాబాయ్‌ అబ్బాయిలు టాయిలెట్‌ బ్రష్‌ పట్టుకుని మిగిలిన పనులు చేయడానికి అస్సలు సిగ్గుపడరు. మరి టాయిలెట్‌ క్లీనింగ్‌ ఒక్కటే అదెవరిదో పని అని ఎందుకు సిగ్గుపడతారు.

అస్సలు సిగ్గుపడకుండా మీరు మరియు డోమెక్స్‌తో కలిసి టాయిలెట్‌ బ్రష్‌ పట్టుకోండి అంటూ చెబుతుండడం ఆకర్షణీయంగా ఉంది. ఇకపోతే వెంకటేష్‌ ప్రస్తుతం మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో 'ఎఫ్‌ 2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం బాగా సన్నబడిన వెంకటేష్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లో యూత్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఇమేజ్‌ ఉన్న వెంకటేష్‌, ఈ డొమెక్స్‌ యాడ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరింత ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. ఇకపోతే రానా విషయానికి వస్తే, రానా ఇప్పటికే పలు కమర్షియల్‌ యాడ్స్‌లో నటిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు.

తాజా కమర్షియల్‌ యాడ్‌లో రానాకి డైలాగులు లేవు కానీ, బాబాయ్‌ పక్కన నిలబడి, టాయిలెట్‌ బ్రష్‌ పట్టుకోవడం బావుంది. అభిమానులకు ఇన్సిప్రేషన్‌గా అనిపిస్తోంది. యంగ్‌ హీరో అబ్బాస్‌ హార్పిక్‌ యాడ్‌లో నటించాడు తప్ప ఇంతవరకూ స్టార్‌ హీరోలెవరూ ఈ తరహా బ్రాండ్స్‌కి ప్రచారకర్తలుగా వ్యవహరించింది లేదు. మొత్తానికి ఈ దగ్గుబాటి బాబాయ్‌ అబ్బాయిలు టాయిలెట్‌ క్లీనింగ్‌ కోసం భలే ప్రచారం చేస్తున్నారులే అని ప్రేక్షకులు ముచ్చట పడకుండా ఉండలేకపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS