టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అనిల్ చేసిన అన్ని సినిమాలు విజయాలు సాధించడంతో స్టార్ హీరోలు అనిల్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణతో భగవంత్ కేసరి చేసి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చిరంజీవితో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఒట్టి పుకార్లు మాత్రమే అని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన F2 , F3 మూవీస్ సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. దీనితో అనిల్ ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ కే ఓటు వేసినట్టు సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అనిల్ తీసిన మూవీస్ కి దిల్ రాజే ప్రొడ్యూసర్ కావటం గమనార్హం. అంటే వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ న్యూస్ విన్న వీరి ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ మూవీ కూడా మంచి హిట్ సాదిస్తుందని , వీరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
ఒక వేళ వెంకీతో అనిల్ మూవీ తీస్తే, అది కూడా హిట్ అయితే వరుసగా ఎనిమిది సినిమాలతో సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు. త్వరలోనే ఈ మూవీకి సంబందించిన న్యూస్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశముంది.