'గురు' సినిమాలో వెంకీని చూసినవారందిరదీ ఒకే మాట, అదరగొట్టేశాడంతే అని. ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర్నుంచీ 'గురు' సినిమా కోసం వెంకీ కొత్తగా ఏదో ట్రై చేశాడనుకున్నారంతా. ఆ మాటే నిజమయ్యింది. స్టైలింగ్ దగ్గర్నుంచి అన్నీ కొత్తగా ఉన్నాయి. అలా కొత్తగా అనిపించడానికి కారణం 'గోపాల గోపాల', 'దృశ్యం' సినిమాలే కారణం కావొచ్చు. వాటిల్లో వెంకీ ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. క్యారెక్టర్‌ని కొంచెం అండర్ ప్లే చేసే పాత్రలవి. ఆ పాత్రలతో ఆకట్టుకున్న వెంకీని ఇలా ఎనర్జిటిక్‌గా 'గురు'లో చూసే సరికి వాట్ ఏ ఎనర్జీ గురూ అనకుండా ఉండలేకపోతున్నారు. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో 'గురు'గా వెంకీ రెచ్చిపోయాడు అంతే. సీరియస్‌నెస్ చూపిస్తూనే, భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. ఇది వెంకీ మాత్రమే చెయ్యగల సినిమా. అందుకే ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఎప్పుడో వెంకీ ఈ సినిమాని చెయ్యాల్సి ఉంది. కానీ గతంలో అనారోగ్య కారణంగా వెంకీ ఈ సినిమాని చేయలేకపోయారు. ఈ లోగా తమిళం, హిందీల్లో ఈ సినిమా తెరకెక్కింది. లేటుగా తెలుగులోకి వచ్చినా కానీ వెంకీ కోసం మొదలైన కథ కాబట్టి, ఆయన కోసమే అన్నట్లుగా సూటయిపోయింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. రీమేక్ సినిమా అయినా కానీ రీమేక్‌లాగే లేదంటున్నారు. అంత బాగా తన నటనతో ఆకట్టుకున్నాడు వెంకీ, సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రితికా సింగ్ హీరోయిన్‌గా నటించింది.