బిగ్ బాస్ లోకి వెంకటేశ్?

By iQlikMovies - September 30, 2018 - 14:16 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ లో ఇంకొన్ని గంటల్లో గ్రాండ్ ఫైనల్ కి రంగం సిద్దమవుతుంది. అయితే ఈ ఫైనల్ కి గ్రాండ్ లుక్ ఇచ్చేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

అందుతున్న వివరాల ప్రకారం, బిగ్ బాస్ ఫైనల్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా వచ్చే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనే ఈరోజు బిగ్ బాస్ విజేత ఎవరు అని ప్రకటిస్తారు అని కూడా చెబుతున్నారు.

అయితే ఇవ్వన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని అసలు ఇప్పటికే ఫైనల్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది అని ముఖ్య అతిధి ఎవరు రాలేదు అని అంటున్నారు.

ఏదేమైనా బిగ్ బాస్ కి సంబంధించి ప్రతి ఒక్కటి ఏదో ఒక సంచలనం అవుతూనే ఉంది..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS