వెంకటేష్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. నారప్ప, దృశ్యమ్ 2 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఎఫ్ 3 చేతిలో ఉంది. ఇది కాకుండా మరో మూడు సినిమాలపై వెంకీ సంతకాలు చేశాడని టాక్. మలయాళ రీమేక్ `డ్రైవింగ్ లైసెన్స్` రైట్స్‌ని సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు తరుణ్ భాస్కర్ తో వెంకీ ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
కథ కూడా ఎప్పటికో సిద్ధమైంది. కానీ సమయం కుదరడం లేదు. త్రినాథరావు నక్కిన సైతం.. వెంకటేష్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ కథ కూడా దాదాపుగా ఓకే అయిపోయిందని తెలుస్తోంది. కాకపోతే ఎఫ్ 3 తరవాత ఎవరి ప్రాజెక్టు ముందుకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి.
నారప్ప, దృశ్యమ్ 3 చిత్రాలన్నీ ఒకేసారి పూర్తి చేశాడు వెంకీ. అలానే.. తరుణ్ భాస్కర్, త్రినాథరావు నక్కిన సినిమాల్ని ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి... ఈ యేడాది వెంకీ నుంచి 2 సినిమాలు, వచ్చే యేడాది మరో మూడు చిత్రాలు రావడం దాదాపుగా ఖాయం.