ఈతరం మల్టీ-స్టారర్ చిత్రాలకి ఆధ్యుడు ఎవరు అంటే అది కచ్చితంగా హీరో వెంకటేష్ పేరే చెప్పుకోవాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో ఆయన దీనికి శ్రీకారం చుట్టారు.
ఇక ఇప్పుడు వెంకి మరోసారి మల్టీ-స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ చిత్రమే F2, ఇందులో వెంకటేష్ తో పాటుగా మెగా అందగాడు వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా, యువ సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు.
ఈ సినిమా టైటిల్ ప్రకారం ఇందులో ఫన్ & ఫ్రస్ట్రేషన్ రెండు ఉంటాయి అన్న క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. మరి ఇందులో ఏ హీరోకి ఏది ఉంటుంది అన్నది మాత్రం ఇంకొన్ని రోజులు ఆగితే కాని తెలియదు. ఇక త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళనుందట అలాగే ఈ ఇద్దరు హీరోల పక్కన ఏ హీరోయిన్స్ అయితే బాగుంటుంది అన్న చర్చలు నడుస్తున్నాయట.
దిల్ రాజు నిర్మాణలో రానున్న ఈ మల్టీ-స్టారర్ కూడా గత మల్టీ-స్టారర్స్ లాగా విజయవంతం కావాలని కోరుకుందాం..