సెన్సార్ బోర్డు వల్ల సినిమాలు రిలీజ్ కి దూరం అవుతుండడం సహజమే. అయితే ఈ మధ్య కాలంలో హిందీ చిత్రాలకు వేరే దేశాల్లో సెన్సార్ చిక్కులు ఎక్కువయ్యాయి.
మొన్నీమధ్యనే ఆమీర్ ఖాన్ దంగల్ చిత్రం పాకిస్తాన్ లో రిలీజ్ చేయాలంటే అందులో ఉండే మన జాతీయ గీతం తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ బోర్డు తెలిపింది. దీనికి ఆమీర్ ససేమిరా అనడంతో పాకిస్తాన్ లో దంగల్ చిత్రం బ్యాన్ అయింది.
ఇది మరువకముందే నిన్న రిలీజ్ అయిన బేగంజాన్ చిత్రం కూడా పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేదించింది. దీనికి కారణం బేగం జాన్ చిత్ర కథ ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు నేపధ్యంలో ఉండడమే.
మొత్తానికి విద్యా బాలన్ నటించిన ఈ చిత్రం పాకిస్తాన్ వరకు రిలీజ్ కి దూరం అయినట్టే.