విద్యా బాలన్ తాజా చిత్రం బేగం జాన్ విడుదలకి ముందే వివాదాల్లో చిక్కుకుంది.
ఈ వివాదానికి కారణం, సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో 12 సన్నివేశాలని తీసేయమని నిర్మాతలని కోరడమే! అయితే ఈ కట్స్ చెప్పడంతో ఒక్కసారిగా బేగంజాన్ యూనిట్ అంతా షాక్ కి గురయ్యారు.
ఈ మధ్యనే పది వరకు హిందీ చిత్రాలు ఇలా సెన్సార్ బోర్డు వద్ద చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు తాజాగా బేగం జాన్ చిత్రం కుడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఇక ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.