ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లలో నటి విద్యా బాలన్ ది ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు. ఎందుకంటె ఆమె ఇటు గ్లామర్ తోనే గాక అటు అభినయంతో కూడా ప్రేక్షకులని రంజింపచేసింది.
ఇదిలాఉంటే, ఆమె ఇంతమంది అందగాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా! వారిలో ఎవరు అందరికంటే అందగాడు అని ప్రశ్నించగా- తాను నటించిన వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు మగాళ్ళలో తన భర్తే తనకు అత్యంత అంధగాడు అని చెప్పెసిందే.
దీనితో ఆమెక తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ అంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోయింది. వీరిరువురి వివాహం 2012లో జరిగింది, వివాహానంతరం కూడా విద్యా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో తుమారీ సుళు అనే చిత్రం ఉంది.