విద్యాబాల‌న్‌ని అడిగారు... కానీ

By iQlikMovies - March 14, 2018 - 12:26 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాల‌య్య న‌టిస్తున్నాడు. అయితే ఆ ఒక్క పాత్ర త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ డైలామాలో ప‌డ్డాయి. 

ఎవ‌రు ఏ పాత్ర‌లో న‌టిస్తార‌న్న విష‌యంలో ఇంత వ‌ర‌కూ ఓ క్లారిటీ రాలేదు. అయితే ఈలోగా ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ క‌నిపించ‌బోతోంద‌ని ఓ ప్ర‌చారం జోరుగా సాగుతోంది.  ``మా ఆప్ష‌న్ల‌లో విద్యాబాల‌న్ ఒక‌రు. ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం..  కానీ.. ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేదు`` అంటూ చిత్ర‌బృందంలోని కీల‌క స‌భ్యుడొక‌రు క్లారిటీ ఇచ్చారు. 

యుక్త వ‌య‌సులో ఉన్న ఎన్టీఆర్‌గా ఓ యువ క‌థానాయ‌కుడు న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పాత్ర‌లో శ‌ర్వానంద్‌, నానిల‌లో ఒక‌రు క‌నిపించే అవ‌కాశాలున్నాయి. ఈనెల‌లోనే ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS