కేజిఎఫ్ దర్శకుడితో రౌడీ హీరో

మరిన్ని వార్తలు

రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ దేవరకొండ కెరియర్ ప్రస్తుతం గాడి తప్పింది. ఎలాంటి  సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ మొదట్లో బానే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. లైగర్ తో పాన్ ఇండియా హీరో అవతారమెత్తిన విజయ్ ఆ మూవీ డిజాస్టర్ కావటంతో గోడకి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఖుషి , ఫ్యామిలీ స్టార్ లాంటి తన జోనర్ సినిమాలు చేసినా ఫలితం దక్కలేదు. సమంతతో కలిసి నటించిన  'ఖుషి; మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది, వసూళ్లు పరంగా కూడా ఓకే అనిపించుకుంది. కానీ ఫ్యామిలీ స్టార్ భారీ డిజాస్టర్ గా నిలిచి, నష్టాలని తెచ్చిపెట్టింది. విజయ్ మార్కెట్, కెరియర్ నిలబడాలంటే సాలిడ్ హిట్ పడాల్సిందే. గౌతమ్ తిన్ననూరితో ప్రజంట్ ఒక సినిమా చేస్తున్నాడు.  ఇలాంటి క్రమంలో  విజయ్ ఫాన్స్ సంబరాలు చేసుకునే వార్త ఒకటి షోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.   


క్రేజీ డైరక్టర్ ప్రశాంత్ నీల్ విజయ్ ని రీసెంట్ గా కలవటమే ఈ వార్తలకి కారణం. విజయ్ ఇంటికి  వెళ్లి మరీ ప్రశాంత్ కలిసినట్లు తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా రానుందని ర్యూమర్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రజంట్ సలార్ 2  షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ విజయ్ తో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా, లేక ఉన్న వాటిలోనే విజయ్ గెస్ట్ రోల్ లాంటిది ఏమైనా చేస్తాడా అని ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్ వన్ లో పృద్విరాజ్ లాంటి మలయాళ  స్టార్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సలార్ 2  లో మరికొన్ని కొత్త పాత్రలు కనిపించే అవకాశముండటంతో విజయ్ ఇందులో నటిస్తున్నాడా? లేదా ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీలో నటిస్తున్నాడా అన్న ఆసక్తి మొదలయ్యింది.    


రీసెంట్ గా  ఈ వార్తలపై ప్రశాంత్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.  విజయ్ దేవరకొండ ప్రశాంత్ కాంబో మూవీ అన్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ప్రశాంత్ తన సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలిపారు. కానీ ఇంత బిజీలో ప్రశాంత్ ఎందుకు విజయ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందో మాత్రం క్లారిటీ లేదు. చూడాలి భవిష్యత్తులో వీరిద్దరి కలయికకు కారణం తెలుస్తుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS