యంగ్ హీరో విజయ్ దేవరకొండ తనని తాను పెద్ద హీరోగా ఊహించుకుంటూ ఎవరికీ అర్ధం కాకుండా ఉన్నాడంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ రెడ్డి ఫ్రీరిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ సినిమాలో ఎక్కువ బూతు పదాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. యు ట్యూబ్ లో సెన్సార్ ఉండదు కాబట్టి టీజర్ అప్ లోడ్ చేసినా అభ్యంతరాలు ఎదురుకాలేదు. అయితే సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంటుంది అనేది ఈ యంగ్ హీరోకి తెలియదా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని బూతు సీన్లని సెన్సార్ బోర్డ్ కత్తెర వేసి వాటిని స్థానంలో మ్యూట్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఈ హీరో సహించటం లేదు.
థియేటర్లలో ఆ పదాలు వచ్చినప్పుడు, వాటి బదులు ఆ డైలాగ్స్ చెప్పమంటూ యూత్ ని రెచ్చగొట్టడం జరిగింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వటం ఈ హీరోకి నచ్చలేదు. తన సినిమాలోని డైలాగ్స్ తొలగించే అధికారం సెన్సార్ బోర్డ్ సభ్యులకు ఎవరిచ్చారు అనే విధంగా కామెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా ' ఏం మాట్లాడుతున్నావ్ రా' అనే డైలాగ్ దగ్గర చివర వచ్చే బూతు పదాన్ని మ్యూట్ చేయటం ఈ యంగ్ హీరోకి తీవ్ర అసహనాన్ని గురిచేస్తుంది. దీంతో మిగతా యంగ్ హీరోలంతా తమ అభిమానులు సభ్యత, సంస్కారం తో ఉండాలంటూ స్పీచ్ లు ఇస్తుంటే, పట్టుమని పది సినిమాలు కూడా చేయని ఈ హీరో ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏమిటి అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.