విజయ్ ని పవర్ స్టార్ తో పోల్చిన దిల్ రాజు

మరిన్ని వార్తలు

నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ ని ఆ మీట్ కి వచ్చిన అతిధులంతా ఆకాశానికి ఎత్తేశారు. దీనికి కారణం విజయ్ అభినయంతో పాటుగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు ఖాతాలో పడడమే.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ- విజయ్ దేవరకొండ ఒక వైవిధ్యమైన నటుడు అలాగే ఒక కొత్త స్టార్ హీరో తెలుగు తెరకి దొరికాడు అని చెప్పాలి. ఇక ఇదే వేదిక పై నుండి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విజయ్ కి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా పవన్ తొలిప్రేమతో ఎలా అయితే అప్పటి యువతరాన్ని తన వైపుకి తిప్పుకున్నాడో ఇప్పుడు విజయ్ కూడా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యువతరంలో ఒక చెక్కు చెదరని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

ఇదే వరుసలో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్- పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది సినిమాకి ఎలా అయితే ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు కూడా అదే రీతిలో విజయ్ గీత గోవిందం చిత్రానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడం ఆనందంగా ఉంది.

దీనితో ఇలా ప్రముఖులంతా విజయ్ దేవరకొండ ని పవర్ స్టార్ తో పోలికలు అంటూ పొగడ్తల్లో ముంచేశారు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS