తినే ప్రతి అన్నం మెతుకుపై పేరు రాసి ఉంటుందట. అలానే... సినిమా కథలపై కూడా రాసి ఉంటుందేమో..? ఎవరికి దక్కాల్సిన హిట్ వాళ్లకే దక్కుతుంది. కొంతమంది చేజేతులా మంచి కథల్ని వదులుకుంటుంటారు. ఇలా... విజయ్ దేవరకొండ చేతిలోంచి ఓ హిట్ చేజారిపోయింది. ఇటీవల విడుదలై... సూపర్ డూపర్ హిట్టయిన చిత్రం `ఉప్పెన`. వైష్ణవ్ తేజ్‌కి ఇదే తొలి చిత్రం. బుచ్చి బాబు సనా దర్శకుడిగా పరిచయం అయ్యారు.
మైత్రీ మూవీస్ నిర్మించింది. బుచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. ముందుగా మైత్రీ నిర్మాతల మదిలో మెదిలిన హీరో.... వైష్ణవ్ తేజ్ కాదు. విజయ్ దేవరకొండ. తనకి ఈ కథ కూడా చెప్పారు. కానీ విజయ్ కి నచ్చలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ తనకి ఎక్కలేదు. దాంతో ఈ సినిమా చేయనని చెప్పేశాడట. ఆ తరవాతే... వైష్ణవ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. చిరంజీవి కథ వినడం, ఓకే చేసేయడం జరిగిపోయాయి. అలా.. విజయ్ చేతిలోంచి హిట్ చేజారిపోయిందన్నమాట. అయితే.... ఈ సినిమా విజయ్ చేసుంటే ఎలా ఉండేదో..? ఇంత కంటే పెద్ద హిట్ అయ్యేది. క్లైమాక్స్.. జీర్ణం చేసుకోలేకపోతే.. డిజాస్టర్ గానూ మిగిలిపోయేది. ఏం చెప్పగలం?