రౌడీస్టార్‌ 'స్ట్రీట్‌ బ్రాండ్‌' ఆటిట్యూడ్‌.!

మరిన్ని వార్తలు

రౌడీస్టార్‌గా తన డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో యూత్‌లో డిఫరెండ్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌ దేవరకొండ. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా, యూత్‌లో ఆ క్రేజ్‌ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మూడు డిఫరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ గెటప్స్‌తో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకోనున్నాడు. ఆల్రెడీ ఓ లుక్‌ అఫీషియల్‌గా రివీల్‌ చేశారు.

 

ఇంకో లుక్‌కి సంబంధించి అఫీషియల్‌ ప్రకటన రాలేదు కానీ, రౌడీ ప్రస్తుతం ఇదే లుక్‌లో కనిపిస్తున్నాడు. అంటే ఇది కూడా సినిమాలో ఓ లుక్‌గానే భావించాలి. ఈ సంగతి అటుంచితే, మనోడికి సినిమాలే కాదు, ఎక్స్‌ట్రా బిజినెస్‌లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అదేనండీ ఆన్‌లైన్‌ బట్టలకొట్టు. ఆ బట్టల కొట్టులో యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే డిఫరెంట్‌ డిజైన్స్‌ లో బట్టలు అమ్ముతూ ఉంటాడు. వాటికి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌. ఫ్యాషన్‌తో పాటు, ట్రెడిషనల్‌ వేర్‌ కూడా మన విజయ దేవరకొండ బట్టల కొట్టులో విచ్చల విడిగా దొరికేస్తుంటాయ్‌. ఈ బిజినెస్‌ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వాటిలో బ్రాండెడ్‌ ఫుట్‌వేర్‌ కూడా యాడ్‌ చేశాడు మనోడు.

 

'స్ట్రీట్‌ బ్రాండ్‌' పేరుతో ఈ ఫుట్‌ వేర్‌ అందుబాటులోకి రానుంది. ఈ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేసేందుకు మనోడు ఓ డిఫరెంట్‌ ఫోటో షూట్‌ చేయించుకున్నాడు. విజయ్‌ దేవరకొండ అంటే ఆటిట్యూడ్‌.. ఆటిట్యూడ్‌ అంటే విజయ్‌ దేవరకొండ. ఆ రెండూ ఓవర్‌ డోస్‌లో మిక్స్‌ అయి ఉన్న ఈ ఫోటోలిప్పుడు నెట్టింట్లో యూత్‌ని కిత కితలు పెట్టించేస్తున్నాయి. ఇక రౌడీ లుక్‌కి యాజ్‌ యూజ్‌వల్‌ యూత్‌ ఫిదా అయిపోతున్నారు. అదీ మన రౌడీ స్ట్రీట్‌ బ్రాండ్‌ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS