తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం సర్కార్ మొదటి లుక్ ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శక-నిర్మాతలు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులని సైతం ఆకట్టుకుంటున్నది.
అయితే ఈ ఫస్ట్ లుక్ కి ప్రశంసలతో పాటుగా విమర్శలు కుడా వచ్చాయి. అయితే ఆ విమర్శలు చేసింది ప్రముఖ రాజకీయ నాయకుడు కావడం మరింతగా ఆసక్తి కలిగిస్తున్నది. ఇంతకి ఆ రాజకీయ నాయకుడు ఏమన్నాడంటే- గతంలో తన చిత్రాలలో నటించేటప్పుడు సిగరెట్ తాగే సన్నివేశంలో నటించను అని అలాగే సిగరెట్ తాగే పాత్ర కూడా పోషించను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇలా సిగరెట్ తాగుతున్న పోస్టర్ విడుదల చేయడమేంటి..
ఆయనకి యువతలో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఇటువంటి బాధ్యాతారాహిత్యమైన చర్యలకి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశించాడు సదరు రాజకీయ నాయకుడు. అయితే ఈ విమర్శల పైన ఇటు హీరో విజయ్ కాని అటు దర్శకుడు మురుగదాస్ కాని ఇంకా స్పందించలేదు.
ఏదేమైనా.. ప్రశంసలతో పాటుగా విమర్శలకు సైతం ఈ సినిమా కేంద్ర బిందువుగా మారిపోయింది.