మహారాజ కలక్షన్ల సునామి

మరిన్ని వార్తలు

ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఏం లేవు. దీనితో చిన్న చిన్న సినిమాలు వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి పోతున్నాయి. అవి వచ్చాయని తెలియక ముందే థియేటర్స్ నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ సినిమా 'మహారాజ' రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు కారణం తమిళ డబ్బింగ్ సినిమా కావటమే. ఈమధ్య తమిళ సినిమాలకి తెలుగులో పెద్దగా మార్కెట్ ఉండటం లేదు. దీనితో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డ్ సృష్టిస్తోంది మహారాజ మూవీ. 


తెలుగులో ఈ సినిమాతో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి, యేవం లాంటి చిన్న సినిమాలతో పాటు సుధీర్ బాబు నటించిన 'హరోం హర' మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటన్నిటికంటే మహారాజ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని ఆడియన్స్ ని అలరిస్తోంది. కారణం కథ, కథనం , విజయ్ సేతుపతి నటన. ఈ మూవీలో వచ్చే ట్విస్టులకి ఆడియన్స్ స్టన్    అవుతున్నారు. దీనితో మొదటి రోజు నుంచే కలక్షన్ల వర్షం మొదలయ్యింది. తెలుగు హక్కుల్ని కొన్న ఎన్‌.వి.ప్ర‌సాద్ కి కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ రైట్స్ ని  శాటిలైట్ హ‌క్కుల‌తో కలిపి 2 కోట్ల‌కు కొనగా థియేటర్స్ లో  5 కోట్ల వరకు వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్ రైట్స్ తో కలిపి మొత్తం 6 కోట్ల లాభం పొందారు ఎన్ వి ప్రసాద్.  


కాగా అన్ని భాషల్లో కలిపి మహారాజ ఇప్పటికి 32.6 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2024 లో తక్కువరోజుల్లో అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన తమిళ మూవీగా రికార్డ్ సృష్టించింది. విజయ్ సేతుపతి కెరియర్లో 50 సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టింది. సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడు డైరక్టర్. అలాగే దర్శకుడి బెస్ట్ ఛాయిస్ గా నిలిచాడు విజయసేతుపతి. నాలుగు రోజుల్లోనే 32 కోట్లు సాధించిన ఈ మూవీ ఇంకా వసూలు చేస్తుందని ఆశిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS