మహారాజ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మహారాజ
దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌
రచన: నిథిలన్‌ స్వామినాథన్‌


నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి.


నిర్మాతలు: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి. 


సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌
సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌
ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌ 


బ్యానర్స్: ప్యాషన్ స్టూడియోస్, ది రూట్
విడుదల తేదీ: 14 జూన్ 2024
 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5


విజయ సేతుపతిని పాన్ ఇండియా హీరోగానే చెప్పుకోవాలి. కోలీవుడ్ లో మొదట కెరియర్ ప్రారంబించి, ఇప్పుడు అన్ని భాషల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా విజయ సేతుపతికి ఫాన్స్ ఉన్నారు. 'ఫర్జి' వెబ్ సిరీస్ లో తన నటనతో నార్త్ ఆడియన్స్ మనసులు గెల్చుకున్నారు. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కత్రినాతో కలిసి మేరీ క్రిస్మస్ సినిమా చేసారు. ఒక వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు విలన్ గా, సహాయక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. విజయ సేతుపతి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో  పరకాయ ప్రవేశం చేస్తారు. కేవలం సేతు పతిని దృష్టిలో పెట్టుకుని కథలు రాసిన దర్శకులు కూడా ఉన్నారు. విజయ సేతుపతి 50వ సినిమా మ‌హారాజా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'మహారాజ' గా సేతుపతి ఎంత వరకు మెప్పించారో చూద్దాం.


కథ : మహారాజ (విజయ్ సేతుపతి) భార్య (దివ్య భారతి) చనిపోతుంది. కూతురు జ్యోతి (సచనా నమిదాస్) తో కలిసి ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతుంటాడు. భార్య ఓ యాక్సిడెంట్‌లో చనిపోగా, కూతురు ప్రాణాలతో బయట పడుతుంది. పాప ప్రాణాలతో బయటపడటానికి కారణం, ఓ ఇనుప చెత్తబుట్ట. యాక్సిడెంట్ టైం లో ఆ బుట్ట పాపపై పడటంతో జ్యోతి బతుకుతుంది. అప్పటినుంచి ఆ చెత్తబుట్టకి 'లక్ష్మి' అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటాడు మహారాజ. తన కూతురు స్పోర్ట్స్ క్యాంప్‌ కి వెళ్ళినప్పుడు దొంగలు మహారాజ ని కొట్టి ఆ బుట్టని తీసుకు వెళ్ళిపోతారు. కూతురు వచ్చేలోపు ఆ చెత్తబుట్టను కనిపెట్టమని మహారాజ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు. చెత్త బుట్ట పోయిందని కంప్లైంట్ చేయటమేంటని పోలీసులు రియాక్ట్ అవుతారు. అసలు ఆ చెత్త బుట్టలో మహారాజ ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తూ రాత్రుళ్లు దొంగతనాలు చేసే సెల్వ (అనురాగ్ కశ్యప్) ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి సంబంధం ఉందా? నిజంగా లక్ష్మి (చెత్తబుట్ట) కోసమే మహారాజ పోలీసుల దగ్గరకు వెళ్లాడా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: ఏ క్యారెక్టర్ అయినా వందకి వంద శాతం న్యాయం చేకూర్చే విజయసేతుపతి ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఈ సినిమా చేసాడు అని చెప్పొచ్చు. 'మహారాజ' సినిమాలో విజయ సేతు పతి కనిపించడు, కేవలం ఒక బార్బర్ మాత్రమే కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ బలంగా రిజిస్టర్ అయ్యేలా చేయడంలో విజయ్ సేతుపతి సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమా మొదట్లోనే తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమాభిమానాలు అర్థం అవుతాయి. తరువాత కూతిరి కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండివాడిలా కనిపిస్తాడు. చెత్తబుట్ట కోసం స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు పిచ్చోడు అనుకుంటాం. కానీ చివరకు, ఇలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకి ఉండాలని, ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. విజయ్ సేతు పతి నవరసాలు పలికించాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిలో ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేకుండా పోతుంది. హీరో క్యారక్టర్ ని జడ్జ్ చేయలేని విధంగా తీర్చి దిద్దారు దర్శకుడు. చెత్త బుట్ట కోసం ఎందుకు ఇంత పట్టుదల అని సిల్లీగా అనిపిస్తుంది. తర్వాత ఒకరి తల నరికినప్పుడు షాక్ అవుతాం. ఇంటర్వెల్ తర్వాత ఒక్కోక్కటిగా ట్విస్ట్ లు రివీల్ అవుతూ, ఆడియన్స్ ని విస్మయానికి గురిచేస్తాయి. పతాక సన్నివేశం లో వచ్చే సీన్ కి కంట తడి పెట్టని వారుండరు. ఒక బారమైన మనసుతో బయటికి వస్తాం. తండ్రీ కూతుర్ల బంధాన్ని చూపించిన విధానం హాట్స్ అప్ అనే చెప్పాలి.


నటీ నటులు : విజయ్ సేతుపతి నటన ఎంచటానికి లేదు. ఈ సినిమాకి తన నటన కీలకం అని చెప్పాలి. ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఒకరు విజయ్ సేతు పతి. రెండు కథ అని చెప్పాలి. కెరియర్లో 50వ సినిమా పెద్ద డైరక్టర్ ని ఎంచు కోకుండా, కొత్త డైరక్టర్ తో ప్రయోగమేంటి అన్నవాళ్ళు , ఈ సినిమా చూసాక అతని ఛాయిస్ కరక్ట్ అనుకుంటారు. విజయ సేతుపతి గట్స్ కి మెచ్చుకోకుండా ఉండలేం. దివ్యభారతి గెస్ట్ రోల్ లో మెరిసింది. సెల్వంగా అనురాగ్ కశ్యప్ విలనిజం బాగుంది. ఈమూవీతో మరోసారి మంచి విలనిజం మెటీరియల్ అనిపించుకున్నారు. చాలా రోజుల తరవాత అభిరామి ఈ సినిమాలో నటించింది. ఇందులో సెల్వం భార్య పాత్రలో కనిపించి మెప్పించింది. మమతా మోహన్ దాస్ స్కూల్ PT టీచర్ గా నటించింది. మిగతా వారంతా తమిళ యాక్టర్స్.  


టెక్నికల్: టెక్నికల్ విషయాలకి వస్తే దర్శకుడిని మెచ్చుకుని తీరాలి. సినిమాకి స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. ఎక్కడా మిస్టేక్స్ దొర్లకుండా జాగ్రత్తగా డీల్ చేసాడు. ఈ కథకి విజయ్ సేతు పతిని ఎంచుకోవటం తోనే సగం సక్సెస్ అయ్యాడు. సాధారణ కథని  తన మార్క్ స్క్రీన్ ప్లేతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయకుండా సాగింది. నిర్మాణ విలువలు కూడా భారీగానే ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్

విజయ సేతుపతి
అనురాగ్ కశ్యప్   
దర్శకుడు
కథ   


మైనస్ పాయింట్స్

స్లో నరేషన్     
మిగతావారికి పెద్దగా స్కోప్ లేకపోవటం   
 

ఫైనల్ వర్దిక్ట్ : ట్విస్టులతో కూడిన రివేంజ్ డ్రామా..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS