`800` చిత్రబృందానికి గట్టి షాక్ ఇచ్చాడు విజయ్‌సేతుపతి. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్ చిత్రం `800`. ఇటీవలే ప్రీ లుక్ విడుదల చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనగా.. ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. మురళీధరన్ తమిళ ద్రోహి అని, అలాంటి వ్యక్తి గురించి తీస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి నటించడం ఏమిటని అంతా ప్రశ్నించారు. అంతేకాదు... తమిళ దర్శకులు భారతీ రాజా లాంటి వాళ్లు సైతం విజయ్ సేతుపతిని ఈ సినిమాలో నటించొద్దని హెచ్చరించారు.
అందుకే విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. `నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నాను. ఇక నుంచి ఈ సినిమా ప్రస్తావన నా దగ్గర తీసుకురావొద్దు.. ఈ సినిమా కి సంబంధించిన ప్రశ్నలేవీ అడగొద్దు` అని విజయ్ గట్టిగానే చెప్పేశాడు. విజయ్ తప్పుకోవడంతో ఈ సినిమాకి స్పీడ్ బ్రేక్ పడినట్టైంది. విజయ్ స్థానంలో మరో నటుడ్ని ఎంచుకుంటారా? లేదంటే.. ఈ సినిమానే ఆపేస్తారా? అనే విషయం ఇప్పుడు తేలాల్సివుంది.