బాహుబలి వంటి బడా చిత్రాలు రచించిన విజయేంద్రప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశాడు.
అదేంటంటే- నన్ను క్షమించండి అని శ్రీవల్లి చిత్ర నిర్మాతలను బహిరంగంగా కోరి అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీవల్లి చిత్రానికి సంబందించిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ- ఈ చిత్రానికి సంబంధించి అందరు తమ శక్తికొలది పనిచేసారు అని కాని ఈ చిత్రం పరాజయం కావడానికి తన దర్శకత్వ లోపమే అని ఒప్పుకోవడమే కాకుండా దానికి తనని క్షమించమని సదరు చిత్ర నిర్మాతలని కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రకటన ఏ దర్శకుడు నుండి మనం వినలేదు. అలాంటిది ఒక చిత్ర పరాజయానికి మొత్తంగా తనే కారణమనే చెప్పడం నిజంగా ఆయనకి ఉన్న గట్స్ అనే చెప్పాలి.