14 ఏళ్ళ తర్వాత వాట్‌ ఏ సీక్వెల్‌!

మరిన్ని వార్తలు

విక్రమ్‌ - త్రిష కాంబినేషన్‌లో 14 ఏళ్ళ క్రితం వచ్చిన తమిళ సినిమా 'సామి'. అది తెలుగులో 'లక్ష్మీనరసింహ' పేరుతో రీమేక్‌ అయ్యింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఆ చిత్రంలో అసిన్‌ హీరోయిన్‌గా నటించడం జరిగింది. తమిళంలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగులో కూడా అంతకన్నా పెద్ద విజయాన్ని అందుకోవడమంటే అందులో ఉన్న కంటెంట్‌ అలాంటిది. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్‌ అయ్యి అక్కడా మంచి విజయాల్ని నమోదు చేసింది. అంతటి ఘన చరిత్ర ఉన్న 'సామి' సినిమాకి సీక్వెల్‌ చేయాలని దర్శకుడు హరి నిర్ణయించాడు. విక్రమ్‌తోనే ఈ సినిమా చేయనున్నాడు హరి. తాను ఊహించని విధంగా ఈ సినిమాలో తనకు హీరోయిన్‌ ఛాన్స్‌ని ఇచ్చారంటూ 'సామి' సీక్వెల్‌ గురించి సోషల్‌ మీడియాలో అందాల భామ త్రిష తెలిపింది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ ఈ 'సామి'. పవర్‌ఫుల్‌గా ఉంటూనే టిపికల్‌ క్యారెక్టర్‌లో హీరో కనిపిస్తాడు. 14 ఏళ్ళ తర్వాత రానున్న ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ని దర్శకుడు హరి పూర్తి చేశాడట. చాలా స్టైలిష్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారమ్‌. అత్యంత భారీ బడ్జెట్‌లో అతి త్వరలో ఈ సినిమాని రూపొందించనున్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ త్వరలో వెల్లడించనున్నారని తెలియవస్తోంది.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS