Vikrant Rona Review: ‘విక్రాంత్‌ రోణ’ మూవీ రివ్యూ&రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్
దర్శకత్వం : అనూప్ భండారి
నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్
ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి


రేటింగ్ : 2.5/5


కిచ్చా సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన హీరోగా చేసిన సినిమాలకు ఇంకా ఇక్కడ మార్కెట్ ఏర్పడలేదు కానీ ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించాడు సుదీప్. అయితే ఇప్పుడు ఆయన నుండి పాన్ ఇండియా తరహలో సినిమా వచ్చింది. అదే ‘విక్రాంత్‌ రోణ’. ఈ సినిమా ట్రైలర్ క్యురీయాసిటీని పెంచింది. త్రీడీ వెర్షన్ లో కూడా విడుదల చేయడం ఒక అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మరి సుదీప్ కి హీరోగా తెలుగులో తొలి విజయాన్ని ఇచ్చిందా ? ఇంతకీ ఏమిటీ  ‘విక్రాంత్‌ రోణ’ కథ


కథ :


విక్రాంత్‌ రోణ’ కథ కోసం ఒక ఊహాత్మక గ్రామాన్ని, వాతావరణం సృస్టించారు. అంటే చందమామ కథల టైపన్నమాట. ఒక్కసారి ఆ చందమామ కథలోకి వెళితే.. అనగనగా ఒక అట‌వీ ప్రాంతం. అక్కడ కొమ‌రొట్టు అనే ఇంట్లో ఓ భ‌యంక‌ర‌మైన రాక్షసుడు ఉన్నాడని,  ఆ ఇంట్లో ఎవ‌రైనా అడుగుపెడితే.. వాళ్లని చంపేస్తున్నాడని ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మినట్లే..  ఆ ఇంటి ప‌రిస‌రాల్లో హ‌త్యలు జ‌రుగుతుంటాయి.  పిల్లలు మాయ‌మైపోయి... ఆ అడ‌విలో చెట్ల‌కు శ‌వాలుగా వేలాడుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేయడానికి వస్తాడు విక్రాంత్ రోణ (సుదీప్‌) ఈ  విచార‌ణ‌లో తెలుసుకొన్న నిజాలేంటి? పిల్లలు చావులకు కారణం ఎవరు ?  నిజంగా రాక్షసుడు వున్నాడా ? వుంటే ఆ రాక్షసుడు ఎవరు ? అనేది మిగతా కథ.


విశ్లేషణ :


ప్రతి కథకు ఒక జోనర్ వుంటుంది. ఐతే ‘విక్రాంత్‌ రోణ’ మాత్రం పది నిమిషాలకోక జోనర్ మార్చుకొని అసలు కథని పక్కన పెట్టేసింది. ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్ గా మొదలైన ఈ కథ..  యాక్షన్  లోకి వెళ్లి .. అడ్వెంచర్‌ గా మారి..  ఫాంటసీ క్రియేట్ చేసి, హారర్ టర్న్ తీసుకొని... రివెంజ్ గా రూపాంతరం చేఇంది.. చివరికి  ఎలాంటి థ్రిల్ లేకుండా ముగిసిపోతుంది. తెరపై బోలెడు ఖర్చు కనిపిస్తున్నా ఆ ఖర్చు బూడిద పోసిన పన్నీరుగా మారుతుంది. సినిమా ని ఉత్కంఠ‌భ‌రితంగా సాగే స‌న్నివేశాల‌తో మొదలుపెట్టిన దర్శకుడు .. ఆ పాయింట్ ని అక్కడే వదిలేసి లేనిపోనీ ఉపకథలు చెప్పుకుంటూ పోయాడు.


అసలు ఇంటర్వెల్ వరకూ ఈ సినిమా కథ ఎటూ సాగదు. సంజు కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ సాగదీత బోరింగ్ డ్రామాగా మారుతాయి.  థ్రిల్లర్ క‌థ రాసుకున్నప్పుడు ప్రేక్షకుడికి థ్రిల్ ఇవ్వడమే లక్షంగా వుండాలి. కానీ ఇందులో మాత్రం సన్నివేశాలు, జోనర్లు పల్టీకొడుతుంటాయి. కథకు అవసరం లేని చాలా సన్నివేశాలు నిరాసం తెప్పిస్తాయి. దర్శకుడు క్రియేట్ చేసిన ఫాంటసీ వర్క్ బావున్నా.. దానికి ఒక టైం లైన్ అంటూ లేకపోవడం మైనస్ గా మారింది. ఒక ప్రపంచం సృష్టించిన తర్వాత అందులో వున్న పాత్రలతో ప్రేక్షకుడికి ఒక కనెక్షన్ వుండాలి. విక్రాంత్‌ రోణ’లో  అలాంటి కనెక్షన్ లేదు. ఇంతా హడావిడి క్రియేట్ చేసి చివరికి పాత సినిమాల ఫార్ములలో కథని ముగించడం అస్సల్ రుచించదు.


నటీనటులు :


సుదీప్ మంచి నటుడు. ఆయన నటనకు వంక పెట్టలేం.  విక్రాంత్  పాత్రలో ఒదిగిపోయాడు.  నిరూప్ భండారి పాత్ర సోసో గానే వుంది. సంజుగా క‌నిపించిన నిరూప్ బండారికి మంచి పాత్రే పడింది. ర‌క్కమ్మగా జాక్వెలిన్ గ్లామర్ తీసుకొచ్చింది. మిగతా నటులు పరిధి మేర చేశారు.


టెక్నికల్ :


సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది, ముఖ్త్మ్గా శివ కుమార్ ఆర్ట్ వ‌ర్క్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం, విలియం ఛాయాగ్రహ‌ణం సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.  దర్శకుడు కథపై ప్రత్యేక ద్రుష్టిపెట్టి వుంటే ఫలితం మరోలా వుండేది.


ప్లస్ పాయింట్స్


సుదీప్
నిర్మాణ విలువలు
జాక్వెలిన్ పాట


మైనస్ పాయింట్స్


బలహీనమైన కథ
స్క్రీన్ ప్లేయ్ లో బలం లేకపోవడం
రొటీన్ క్లైమాక్స్


ఫైనల్ వర్దిక్ట్ : టైటిల్ లో వున్న పవర్ సినిమాలో లేదు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS