శీన‌య్య‌కు ఊపొచ్చింది.

మరిన్ని వార్తలు

ద‌ర్శ‌కుడు వినాయ‌క్ హీరోగా మారిన సంగ‌తి తెలిసిందే. వినాయ‌క్‌తో దిల్ రాజు `శీన‌య్యా` అనే సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్పుడు శీన‌య్య‌కు ఊపొచ్చింది. ఈ సినిమా మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. ఈనెల 27 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఏక‌ధాటిగా సినిమాని లాగించేస్తారు.

 

శ్రియ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి న‌ర‌సింహారావు ద‌ర్శ‌కుడు. ఇది వ‌ర‌కు కొంత మేర షూట్ చేశారు. అయితే ఆ స‌న్నివేశాలేం దిల్‌రాజుకి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి, ఇప్పుడు కొత్త‌గా షూటింగ్ మొద‌లుకానుంది. ఈలోగా క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS