రానా సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ‘నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ట్రైలర్ అంతా నక్సల్ వార్ కనిపించింది. సాయి పల్లవి వెన్నెల పాత్రలో ప్రేమకథ కూడా వుంది. ‘చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..’అనే రానా డైలాగ్ తో ట్రైలర్ మొదలైయింది. ప్రియమణి, నవీన్ చంద్రలకు కూడా ట్రైలర్ లో చోటు దక్కింది. చిత్రీకరణ చాలా నేచురల్ గా వుంది. చాలా యాక్షన్ దృశ్యాలు వున్నాయి.
సాయి పల్లవి పాత్ర ఇందులో కీలకంగా కనిపిస్తుంది. ''ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇది నా కథ'' అనే డైలాగ్ తో ట్రైలర్ ని ఎండ్ చేయడం కూడా వెన్నెల పాత్రకి వున్న ప్రాధన్యతకు అద్ధం పట్టింది. ట్రైలర్ ఫస్ట్ షాట్ లో కల్లాపి చల్లిన వెన్నెల .. అదే చేతితో బాంబులు, తుపాకీ పేల్చడం ఆమె పాత్ర ఎంత వైవిధ్యంగా వుంటుందో చూపిస్తుంది. రానా కూడా చాలా ఇంటెన్స్ గా కనిపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.