మద్రాస్ హైకోర్టుకి హీరో విశాల్ హజరయ్యాడు.
ఎందుకంటే తమిళ నటుడు రాదారవి తనని నడిగర్ సంఘం నుండి అక్రమంగా తప్పించారు అంటూ కోర్టుని ఆశ్రయించాడు. ఇక ఈ అంశంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఈ విచారణకి నిన్న కోర్టుకి వచ్చాడు.
ఈ అంశంలో నడిగర్ సంఘంలోని ఎక్కువ సభ్యులు రాధారవి నిష్క్రమనకే ఓటు వెయ్యడంతో ఆయనని తప్పించామని కోర్టుకి తెలిపాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసుని తదుపరి విచారణని జనవరి 18కి వాయిదా వేసింది.
ఇప్పటికే విశాల ఆర్కే నగర్ లో నామినేషన్ వేయడం ఆ తరువాత ఆయనకీ సొంత ప్యానెల్ నుండే తీవ్ర వ్యతిరేకత రావడం కూడా చూశాము. ఈ పరిస్థితులో ఈ కేసు ఆసక్తికరంగా మారింది.
అయితే తాను ఏమి తప్పు చేయలేదు అని, నిబంధనలకి లోబడే తాము నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చాడు విశాల్.