వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. స్టార్ హీరోల ప్రభావం ఈసారి తమిళనాట రాజకీయాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.కమల్ హాసన్ ఇది వరకే పార్టీ పెట్టేశాడు. ఇప్పుడు రజినీకాంత్ కూడా రంగంలోకి దిగాడు.తాజాగా విశాల్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది.
విశాల్ కు రాజకీయాలపై మక్కువ ఉంది. అయితే ఆయన పార్టీ స్థాపించడం లేదు. ఏదైనా ఓ పార్టీ తరపున బరిలోకి దిగే అవకాశం ఉంది. లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్ని కలలో నిలబడతార్ట. నిర్మాతల సంఘం ఎన్నికలు నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేసి ఆ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక రాగా విశాల్ పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. విశాల్ నామినేషన్ ప్రతిపాదించిన కొంతమందిలో తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశాల్ నామినేషన్ తిరస్కరించారు. అదే నియోజక వర్గం నుంచి విశాల్ బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.