1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం మనదేశం చరిత్రలో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విజయంతోనే మనదేశంలో క్రికెట్ కి ఆదరణ పెరగడం మొదలయ్యింది, ఇక ఇప్పుడు భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ విజయాన్ని అందించిన కపిల్ దేవ్ సేనని గుర్తుతెచ్చుకుంటూ వారి వరల్డ్ కప్ ప్రయాణన్ని ఒక చిత్రం రూపంలో తీసుకురావడానికి రంగం సిద్ధం అయింది. అదే ’83 పేరిట రానున్న చిత్రం. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రని ప్రముఖ హిందీ నటుడు రన్వీర్ సింగ్ పోషిస్తుండగా బజరంగి భాయిజాన్ వంటి హిట్ చిత్రం అందించిన కభీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, CCL మరియు SIIMA అవార్డ్స్ వ్యవస్థాపకుడు అయిన విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈ రోజు ముంబైలో జరిగిన ఈ చిత్ర ప్రారంబోత్సవ కార్యక్రమంలో నిర్మాత విష్ణుతో పాటుగా హీరో రన్వీర్ సింగ్, దర్శకుడు కభీర్ ఖాన్, 1983 వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యులు కపిల్ దేవ్, మొహిందర్ అమర్నాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సందీప్ పాటిల్, కృష్ణమాచారి శ్రీకాంత్, యశ్పాల్ శర్మ, దిలీప్ వెంగ్సర్కార్ లు పాల్గొన్నారు.
త్వరలోనే అలనాటి మధురజ్ఞాపకాలని మనం వెండితెరలో చూడబోతున్నాం..