ఇప్పటిదాక టీజరే..ఇప్పుడు ఎన్టీఆర్ అసలు సినిమా స్టార్ట్ !

మరిన్ని వార్తలు

ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ పాల్గొన్న మొదటి ఈవెంట్ విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ప్రీరిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో సినిమా కంటే ఎన్టీఆర్ గురించి ఎక్కువ మాట్లాడారు అతిధులు యూనిట్ సభ్యులు కూడా. హను రాఘవపూడి అయితే ఒక మాస్ ఉపమానం వాడారు. ''ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒక టీజర్ మాత్రమే. ఇప్పుడు ఆసలు సినిమా మొదలైయింది. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్' అన్నారు

 

ఇక విశ్వక్ సేన్ కూడా..తన సినిమా గురించి చెప్పడం మర్చిపోయి మరీ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ''ఇండియాని గర్వంగా చేసిందుకు థాంక్స్ అన్నా. ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎన్టీఆర్ అని ఎప్పుడో చెప్పా. 17 ఏళ్లకు బాంబులు వేసి తొడగొట్టారు.. మళ్ళీ అది రిపీట్ కాదు. ఇప్పటి వరకూ చూసింది తారక్ అన్న టీజరే. ఇప్పుడు నుంచి అసలు సినిమా మొదలైయింది. నేను పడిపోతే బావుండు. నవ్వుదామని చాలా మంది వుంటారు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడని అనుకుంటా. అందుకే నాకు తోడుగా అన్నని పంపించాడు. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ అయిపొయింది'' అని తన ఆనందం వ్యక్తం చేశాడు విశ్వక్.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS