వరుణ్ సందేశ్ భార్య నటి అయిన వితికా షేరు ఆత్మహత్యకి పాల్పడినట్టు వచ్చిన వార్తలతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని వితికా తన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అదేకాకుండా తను నిద్రమాత్రలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో అలాగే దానికి దారితీసిన పరిస్థితులని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.
ఈ మధ్యనే తను అమెరికా నుండి రావడం జరిగిందని దానితో ఇక్కడ టైమింగ్స్ కి కొద్దిగా ఇబ్బంది పడ్డాను అని చెప్పింది. ఆ కారణంగానే తాను నిద్ర కోసం నిద్రమాత్రలు ఎక్కువగావాడడంతో ఇలా జరిగింది అని అంతేతప్ప తనకి వరుణ్ కి ఎటువంటి ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చేసింది.