బాలయ్యకు ఆ విలన్ ను సెట్ చేసిన బోయపాటి

By iQlikMovies - August 13, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే 'సింహా', 'లెజెండ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో #BB3 తెరకెక్కుతోంది.  ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమాలు ప్రధానమైన విలన్ పాత్రకు ఇంకా నటుడిని ఎంచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మెయిన్ విలన్ పాత్రకు దర్శకుడు బోయపాటి శ్రీను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ని ఎంచుకున్నారు.  బోయపాటి గత చిత్రం 'వినయ విధేయ రామ' లో కూడా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించారు. కరోనా క్రైసిస్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ప్రారంభించగానే వివేక్ ఒబెరాయ్ #BB3  టీమ్ తో జాయిన్ అవుతారని సమాచారం అందుతోంది.

బోయపాటి శ్రీను విలన్ పాత్రలను చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. మరి ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పాత్రను ఎలా మలిచారు అనేది ఆసక్తికరం. ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS