చిరు సూప‌ర్ హిట్ రీమేక్ పై వినాయ‌క్ దృష్టి?

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య ఎందుకో ద‌ర్శ‌కుల రేసులో బాగా వెన‌క‌బ‌డిపోయాడు వి.వి.వినాయ‌క్‌. టాప్ డైరెక్ట‌ర్ అయినా, ఇండ్ర‌స్ట్రీ హిట్లు ఇచ్చినా వినాయ‌క్‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అయితే... క‌థ‌లు రెడీ చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, రిలాక్డ్స్ అయిపోవ‌డం వ‌ల్లే వినాయ‌క్ సినిమాలు చేయ‌లేక‌పోతున్నాడ‌న్న ఓ టాక్ ఉంది. దాన్ని చెరిపేసే ప‌నిలో త‌న క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేశాడు వినాయ‌క్‌. చిరంజీవితో `లూసీఫ‌ర్‌` రీమేక్‌ని ఓకే చేసుకున్న వినాయ‌క్‌, నంద‌మూరి బాల‌కృష్ణ కోసం ఓ క‌థ ని సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. ఇవి రెండూ కాకుండా మ‌రి కొన్ని క‌థ‌ల్ని కూడా రెడీ చేస్తున్నాడ‌ట‌.

 

అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ కోస‌మ‌ని టాక్‌. రామ్ చ‌ర‌ణ్ - వినాయ‌క్ కాంబోలో `నాయ‌క్` వ‌చ్చింది. మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ కాంబో మ‌ళ్లీ ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. అయితే ఈసారి.. చ‌ర‌ణ్ కోసం ఓ రీమేక్ క‌థ‌ని ఎంచుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. చిరు సూప‌ర్ హిట్ సినిమాని వినాయ‌క్ రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. చర‌ణ్‌కి ఎప్ప‌టి నుంచో `గ్యాంగ్ లీడ‌ర్‌`ని రీమేక్ చేయాల‌ని వుంది. వినాయ‌క్‌కూడా ఆ సినిమాపైనే ఫోక‌స్ పెట్టాడ‌ని టాక్‌. టాలీవుడ్ లో ఓ స్టార్ రైట‌ర్ గ్యాంగ్ లీడ‌ర్ ని ఈత‌రానికి నచ్చేలా రాస్తున్నాడ‌ని, అన్నీ ఓకే అయితే ఆ సినిమా చ‌ర‌ణ్ తో తీస్తార‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS