ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలు పోటీ పడ్డాయి. రెండింటిలోనూచ హీరోయిన్ శ్రుతిహాసనే కావడం విశేషం. ఈ రెండు సినిమాల ప్రమోషన్ల బాధ్యత తనపై ఉంది. అయితే... వీర సింహారెడ్డి ని గట్టిగా ప్రమోట్ చేసిన శ్రుతి.. వాల్తేరు వీరయ్యని పట్టించుకోలేదు.
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ కు హాజరైన శ్రుతి... ఆ వెంటనే జరిగి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ కి డుమ్మా కొట్టింది. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో మెరిసిన శ్రుతి.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కనిపించలేదు. రెండు సినిమాలూ ఒకే బ్యానర్లో వచ్చాయి. రెండింటికీ భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకొంది. అయినా సరే.. చిరంజీవి సినిమాని వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీర సింహారెడ్డి కంటే, వాల్తేరు వీరయ్య పెద్ద హిట్. కలక్షన్ల పరంగా చిరు సినిమానే దూసుకుపోతోంది. ఇలాంటి దశలో.. హిట్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తారంతా. కానీ శ్రుతి మాత్రం వాల్తేరుని వదిలేసి వీర సింహారెడ్డి వెంట పడుతోంది. వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో శ్రుతికి మంచి సాన్నిహిత్యం ఉంది. గోపీచంద్ చేసిన మూడు సినిమాల్లో శ్రుతి హీరోయిన్. అందుకే... వీర సింహారెడ్డిని మోస్తోందేమో అన్నది ఇన్ సైడ్ వర్గాల వారి మాట.