త్రివిక్రమ్ అంటే ఒక బ్రాండ్. ఆయన మూవీలో మాటల మాయాజాలం, కుటుంబ బంధాలు, అన్ని కలిసి కలగాయి కూరలా ఉండేది. త్రివిక్రమ్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చినా, ఇంకా అదే కథ, ఆ పాత్రలు వెంటాడేవి. అంతలా ఇంజక్ట్ చేసే మాటల మాంత్రికుడు ఇప్పుడు తడబడుతున్నాడు. అరవింద సమేత తరవాత చెప్పుకొదగిన హిట్ లేదు. అతడు, ఖలేజా తరవాత మహేష్ తో గుంటూరు కారం సినిమా అనగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ మొదటి రోజు మొదటి షో తోనే పెదవి విరిచేసారు. ఈ డిజాస్టర్ కి కారణం త్రివిక్రమ్ అని ముద్ర పడిపోయింది. వన్ మేన్ షో లా మొత్తం తన బుజాల పైనే మహేష్ నడిపించాడని, కథలో పెద్ద గా పసలేదని , త్రివిక్రమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
త్రివిక్రమ్ టైమ్ అయిపోయిందని, ఔట్డేటెడ్ కథతో, కాపీ కథలతో, జనాల్ని మెప్పించలేడని, సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత చెత్త కథకి త్రివిక్రమ్ దాదాపు మూడేళ్లపాటు స్క్రిప్ట్‌పై పనిచేసారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. థమన్ సంగీతం కూడా ఆకట్టుకోలేదు. మొత్తం స్టోరీ అంతా పాత సినిమాల నుంచి తీసుకున్న కథ అని ఏకి పారేస్తున్నారు. త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్స్ కోసం వివిధ ప్రాజెక్ట్‌లలో నిమగ్నమై ఉన్నందున స్క్రిప్ట్‌వర్క్‌పై ద్రుష్టి పెట్టలేదని, సమాచారం. ఇప్పటి కైనా త్రివిక్రమ్ మేలుకొంటే, మళ్ళీ సక్సెస్ ని అందుకోవచ్చని, కచ్చితంగా ఆడియన్స్ ని అలరించే సినిమాలు వస్తాయని సినీ విశ్లేషకుల వాదన.