చిరంజీవి ఆర్థిక స్థితుగతుల గురించి అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నారాయన. వందల కోట్ల ఆస్తి కూడబెట్టారు. అనేక వ్యాపారాలున్నాయి. తనయుడు రామ్ చరణ్ కూడా హీరోగా స్థిరపడ్డారు. కాకపోతే... అప్పులు తీర్చడానికి చన్నైలోని విలువైన ప్రాపర్టీని అమ్మాల్సివచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ బయటపెట్టారు.
ప్రజారాజ్యం.. కాంగ్రెస్ లో విలీనం చేసినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ పేరు మీద చాలా అప్పులున్నాయట. అవన్నీ తీర్చడానికి చిరు ఆస్తిని అమ్మాల్సివచ్చిందని చెప్పారు. ప్రతీ పార్టీకీ కొన్ని ఆస్తులు, అప్పులు ఉండడం సహజం. పార్టీని విలీనం చేస్తున్నప్పుడు వాటిని క్లియర్ చేసుకోవాల్సిందే. చిరంజీవి కూడా అదే చేశారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి, చిరంజీవి వందల కోట్ల రూపాయలు దండుకొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ పేరుతీ చిరు వ్యాపారం చేశారని విమర్శకులు ధ్వజమెత్తారు. వాటికి సమాధానంగానే ఎన్వీ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.