నాగశౌర్య హీరోగా వస్తోన్న సినిమా 'అశ్వథ్ధామ'. ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమాతో నాగశౌర్య రచయితగా మారిన సంగతి తెలిసిందే. శౌర్య సొంతంగా రాసుకున్న కథలో తొలిసారి నటిస్తున్నాడు. అయితే, ఈ కథను చాలా ఎమోషనల్‌గా ఫీలై రాశాడట. అంతే ఎమోషనల్‌గా ఫీలయ్యి నటించాడట. సినిమా కమర్షియల్ హిట్ అయినా, అవ్వకపోయినా పెద్దగా బాధపడను కానీ, సినిమాకి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉందని నాగశౌర్య సీరియస్‌గా చెబుతున్నాడు. యదార్ధ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని శౌర్య ఈ కథని సిద్ధం చేశాడు. రమణ తేజ అనే కొత్త దర్శకున్ని ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.
సొంత కథే కాదు, నాగశౌర్య సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇకపోతే సినిమాలోని పాత్రలన్నీ ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అవుతాయనీ, సినిమా చూస్తున్నంతసేపూ, ఆ ప్రపంచంలోకి ప్రేక్షకున్ని తీసుకెళ్లిపోయేలా నేచురల్‌గా సన్నివేశాలు తెరకెక్కించామనీ చెబుతున్నాడు నాగశౌర్య. ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచేశాడు. ప్రతీ ఒక్కరిలోనూ అశ్వథ్ధామ ఉంటాడనీ, చెడుని ఎదిరించే సమయంలో ఆ అశ్వథ్ధామ ఆటోమెటిగ్గా బయటికి వస్తాడనే సందేశాన్నిచ్చే సినిమా ఇది. ఇంతవరకూ చాక్లెట్ బోయ్‌లా, పక్కింటబ్బాయ్‌లా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగశౌర్యలోని అసలు సిసలు నటుడ్ని బయటికి తీసిన సినిమా 'అశ్వధ్ధామ' అంటున్నారు. మరి ఈ ప్రచారమంతా నిజమేనా.? అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.