సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్‌లో నయనతార పేరు తప్పకుండా ఉంటుంది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయిక నయన్. తన క్రేజ్ అలాంటిది. వచ్చిన ప్రతీ సినిమానీ ఒప్పుకోదు. తనకంటూ కొన్ని కండీషన్స్ ఉంటాయి. ఇన్ని షరతుల మధ్య, ఇంతింత పారితోషికం ఇచ్చి నయనని సినిమాల్లోకి తీసుకుంటే కనీసం ప్రచారానికి కూడా రాదు. ప్రెస్ మీట్లు, ఆడియోఫక్షన్లలో కనిపించదు. ఇంటర్వ్యూలు అస్సలే ఇవ్వదు. మీడియా అంటే ఎలర్జీ అన్నట్టు ప్రవర్తిస్తుంది. దానికి గల కారణాన్ని ఎట్టకేలకు బయటపెట్టింది నయన.
''మీడియా అంటే నాకెలాంటి వ్యతిరేక భావన లేదు. ఇండ్రస్ట్రీకి వచ్చినకొత్తలో నేను కూడా అందరిలానే మీడియాతో ఎప్పుడూ టచ్‌లో ఉండేదాన్ని. అడిగినవాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేదాన్ని. కానీ.. నా వ్యాఖ్యలను వక్రీకరించి రాసేవాళ్లు. దాంతో అభిమానులకు తప్పుడు సంకేతాలు అందేవి. అందుకే నేను మీడియాకు దూరంగా ఉండడం మొదలెట్టా. నటిగా నా బాధ్యత నా పాత్రకు న్యాయం చేయడమే. అది చేస్తే చాలు. మరేవీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అంటూ.. తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది.