100 కోట్ల క్లబ్ లో బాలయ్య చేరనున్నాడా?

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణ జోరు పెంచారు. ఒక వైపు సినిమాలు, ఇంకో వైపు రియాల్టీ షో లతో అదరగొడు తున్నారు. త్వరలో ఆహాలో అన్స్టాపబుల్ షో తో అలరించేందుకు సిద్ధంగా ఉన్న బాలయ్య సంక్రాంతో బరికి సై అంటున్నారు. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK109' సినిమా చేస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని, సంక్రాంతికి  రాక పక్కా అని అనౌన్స్ చేసారు. హ్యాట్రిక్  హిట్స్ కొడుతున్న బాలయ్య ఖాతాలో మరొక బ్లాక్ బ్లస్టర్ చేరటం ఖాయమని ఫాన్స్ భావిస్తున్నారు.  


ఇంకా టైటిల్ నిర్ణయించకపోయినా అప్పుడే ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 35-40 రేషియోతో 'NBK109' బిజినెస్ ని కంప్లీట్ చేసారంట. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 90 కోట్ల బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. అంటే రిలీజ్ కి ముందే బాలయ్య సినిమా వంద కోట్లు కలక్షన్ సాధించింది. ఓన్లీ థియేట్రికల్ బిజినెస్ లోనే 100 కోట్ల దగ్గర వసూల్ చేస్తే, ఇంకా డిజిటల్ , శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. 


ఇవి కాక ఓవర్సీస్ లెక్కలు, ప్రీమియర్ షో అంటూ ఇంకా ఎక్కువే కలక్ట్ చేయొచ్చు. ఈ సినిమాతో బాలయ్య కూడా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవనున్నారని నందమూరి ఫాన్స్ రెట్టింపు ఉత్సాహాంగా ఉన్నారు. బాలయ్య కెరియర్ లో ఇప్పటివరకు ఇదే హయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ అని టాక్.  ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ గా, ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS