ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' నిలిచింది. ఇది ఎప్పటి వరకూ అంటే 'బాహుబలి ది కన్‌క్లూజన్' రిలీజ్ కాకముందు వరకూ. అయితే 'బాహుబలి ది కన్‌క్లూజన్' వచ్చినాక లెక్కలు మారిపోయాయి. 'దంగల్'ని వెనక్కి నెట్టేసి, 'బాహుబలి ది కన్‌క్లూజన్' హిందీ వెర్షన్ ముందుకొచ్చేసింది. తెలుగులో, హిందీలోనే కాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించేసింది ఈ సినిమా. అయితే ఇప్పుడు 'దంగల్' గురించి మాట్లాడకోవల్సి వస్తోంది. చైనాలో ఈ సినిమా విడుదలయ్యాక 'బాహుబలి' సినిమాకి గట్టి పోటీగా నిలిచింది. లెక్కల అంచనాలు తారుమారు కాబోతున్నాయి. 'బాహుబలి' వెనకాలే నిలుస్తూ 'బాహుబలి' సాధించిన రికార్డుల్ని కొల్లగొడుతోంది. చైనాలో నిన్నటి వరకూ ఈ సినిమా సాధించిన వసూళ్లు 544 కోట్లు దాటేసింది. మొత్తం వసూళ్లు దాదాపు 1400 కోట్లకి చేరిపోయింది 'దంగల్' సినిమా ఈ లెక్కలతో. ఇంకా చైనాలో నాటౌట్ కాకుండా జోరుగా రన్ అవుతోంది. అంటే ఈ వారం గడిచేసరికి ఇదే జోరు కొనసాగితే, 'దంగల్' సినిమా 2000 కోట్లు చేరిపోయేలానే ఉంది. అంటే 'బాహుబలి'ని 'దంగల్' దాటేస్తుందా? లేక ఈక్వెల్ అయ్యి ఈ రెండు సినిమాల వసూళ్లు టై అవుతాయా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా ఇండియన్ మూవీస్ అయిన ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇండియన్ సినిమా సాధిస్తున్న విజయంగా భావించాలి.