సినీ మహిళా సంఘం

మరిన్ని వార్తలు

శ్రీ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టి తెలుగు ఇండస్ట్రీ పైకి తిప్పగలిగింది. దీనితో టాలీవుడ్ లో #CastingCouch గురించిన చర్చలు, అందులోనూ శ్రీ రెడ్డి విడుదల చేసిన ఫోటోలు, ఈ అంశాల పైన MAA స్పందన వంటివి మనం చూస్తూనే ఉన్నాము.

ఇక ఇదే అంశం పైన పలు మహిళా సంఘాలు, #CastingCouch బాధితులు, ఇండస్ట్రీలోని మహిళా నటీనటులు నిన్న ఒక మీట్ ది ప్రెస్ నిర్వహించడం అలాగే ఈ అంశాల పైన ఒక రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఇందులో అందరు తమ తమ అనుభవాలు, ఇవన్ని అరికట్టడానికి ఏమి చేయాలి, అలాగే అవకాశం ఇస్తాను అని చెప్పి మోసం చేసేవాళ్ళని తప్పకుండా శిక్షించాలి అని కోరారు. 

ఈ క్రమంలో మీడియా వారు కూడా తమకి సహకరించాలి, వారితో పాటు ఇండస్ట్రీ లోని పెద్దలు కూడా తమకి మద్దతు గా నిలవాలి అని చెప్పారు. ఇక భవిష్యత్తులో వీటిని అరికట్టడానికి సినిమా మహిళా సంఘం అంటూ ఒకటి ఏర్పాటు చేసి ఏవైనా సమస్యలు వస్తే వాటిని ఎదురుకోవడానికి ఈ సంఘం ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చారు.

మొత్తానికి శ్రీ రెడ్డి ఎపిసోడ్ తో మొదలై అనేక మలుపులు తిరుగుతూ పోతున్నది ఈ అంశం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS