'కాటమరాయుడు' సినిమాలో శృతిహాసన్‌తో పాటు, మరో నలుగురు హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరే యామినీ భాస్కర్. సినిమా హిట్ అయ్యి ఉంటే, ఈ నలుగురు ముద్దుగుమ్మల స్టార్ మరోలా ఉండేది. అయితే దురదృష్టవశాత్తూ, సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మల గ్లామర్‌కు విలువే లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత ఆ సినిమాలో నటించిన యామినీ భాస్కర్ తెర ముందుకొచ్చింది. తెర ముందుకు అంటే, ఇంకా రాలేదులెండి. రాబోతోంది. యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న 'నర్తనశాల' సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో అందాలారబోతతో తనను తాను కొత్తగా మరోసారి పరిచయం చేసుకుంటోంది. తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఒక్కోటి బయటికి తీయనుందట. శాంపిల్‌కి ఓ యాంగిల్ మీ కోసం. చూశారుగా, డిజైనర్ మోడ్రన్ కాస్ట్యూమ్‌లో అమ్మడి గ్లామర్ యాంగిల్. స్పెషల్ కిక్కిస్తోందా? ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయట. ముందు ముందు చూపిస్తుందట. అందాకా దీంతో సరిపెట్టుకోండన్నట్లుంది మరి.