మహానటుడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ జీవితంపై ఆయన తీయబోతున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రం గురించిన రోజుకొక విశేషాలు వెల్లడిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇదే కోవలో కొద్దిసేపటి క్రితం లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించబోయే వ్యక్తి పేరు చెప్పి సంచలనం సృష్టించాడు. ఆ వ్యక్తి పేరు పీ రాకేశ్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలియచేశాడు. దీనితో ఒక్కసారిగా ఈ చిత్రానికి రాజకీయ రంగు అంటుకున్నది.
ఇప్పటికే ఈ చిత్రం తీయడం వల్ల ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రని ఆ చిత్రంలో ఎలా మలుస్తారో అన్న సందేహాలతో ప్రేక్షకులు ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మనిషి దీనికి నిర్మాత అని తెలియడంతో ఇక ఈ చిత్రం చుట్టూ రాజకీయం తిరగబోతుంది అన్నది కన్ఫర్మ్ అయింది.
అయితే ఈ సందర్భంగా ఆర్జీవీ ఒక పోస్ట్ పెడుతూ- “నా దర్శకత్వంలో వస్తున్న "లక్ష్మి'స్ యన్ టి ఆర్" చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని.” తన మనసులో మాట చెప్పేశాడు.