నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ రివ్యూ రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: అల్లు అర్జున్, అణు ఇమాన్యుల్, అర్జున్, బోమన్ ఇరాణి, రావు రమేష్, వెన్నెల కిషోర్, నదియా
నిర్మాణ సంస్థ: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
సంగీతం: విశాల్-శేఖర్
ఛాయాగ్రహణం: రాజీవ్ రవి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సమర్పణ: నాగబాబు
నిర్మాతలు: శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్
రచన-దర్శకత్వం: వక్కంతం వంశీ

రేటింగ్: 3.75/5

కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా ఒక వైవిధ్యమైన పాత్ర అయిన మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరి ఈ కొత్త పాత్రలో బన్నీ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించాడు? రచయతగా సక్సెస్ కొట్టిన వక్కంతం వంశీ దర్శకుడిగా కూడా విజయం అందుకుంటాడా? ఈ ప్రశ్నలకి సమాధానం ఈ క్రింద సమీక్షలో చూద్దాం...

కథ:

సూర్య (అల్లు అర్జున్)- జీవితంలో ఏకైక లక్ష్యం ఏంటంటే- దేశ సరిహద్దులకి రక్షణగా ఉండడం. అయితే అతనికి ఉన్న ఏకైక బలహీనత- కోపం. దీన్నివల్లనే మిలిటరీలో క్రమశిక్షణ ఉల్లంగిస్తాడు. దీనితో కోర్టు మార్షల్ కాబడతాడు. అయితే తిరిగి మిలిటరీ కి వెళ్ళాలంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఒక పెద్ద సైకాలజిస్ట్ అయిన రామకృష్ణ (అర్జున్) నుండి తన మానసిక స్థితి పైన ఒక క్లియరెన్స్ పొందాల్సి వస్తుంది.

అయితే రామకృష్ణ దగ్గర నుండి ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాడా? తిరిగి ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేశాడా? వీటికి సమాధానాలు వెండితెర పైన చూడాల్సిందే...

నటీనటుల ప్రతిభ:

అల్లు అర్జున్: సూర్య పాత్రలో మనకి ఒక కొత్త అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఒక యారగేంట్ మిలిటరీ ఆఫీసర్ కి ఉండే హావభావాలని చక్కగా పలికించాడు. ఇప్పటివరకు బన్నీ చేసిన వైవిధ్యమైన పాత్రల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోనుంది.

అణు ఇమాన్యుల్: తన పాత్ర వరకు బాగానే న్యాయం చేసింది. డ్యాన్సులు అలాగే గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది.

అర్జున్: సైకాలజిస్ట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అల్లు అర్జున్ – అర్జున్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ధియేటర్ లో ప్రేక్షకులని కట్టిపడేసేలా చేస్తాయి.

శరత్ కుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్,నదియా తదితరులు తమ పాత్రల పరిధిలో నటించేశారు.

విశ్లేషణ:

కథా రచయత నుండి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి తన సర్వశక్తులు ఒడ్డి దీనిని ఒక గొప్ప కమర్షియల్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేశాడు. అలాగే ఈ చిత్రంలో కథతో పాటు మాటలకి కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.

ఇక అల్లు అర్జున్ ని మాత్రం చాలా చక్కగా ఆవిష్కరించాడు అని చెప్పాలి. కథనంలో కూడా ఎక్కడ ఎంతమేరకు అవసరం అన్న చోటనే పవర్ ఫుల్ సన్నివేశాలని నింపుకుంటూ ఒక సరైన కథని రాసే ప్రయత్నం చేశాడు.

ఇదిలావుండగా ఈ చిత్రంలో అన్ని అంశాలు సమపాళ్ళలో ఉండే విధంగా దర్శకుడు ముందుగా సిద్ధం అవడంతో ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ చిత్రంగా పేరు తెచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

సాంకేతిక అంశాలు:

రాజీవ్ రవి అందించిన ఛాయాగ్రహణం ఒక పెద్ద ప్లస్ అనే చెప్పాలి. అలాగే సంగీత దర్శక ద్వయం విశాల్ & శేఖర్ పేరుకి హిందీ బాషాలో ఎక్కువగా సంగీతం అందిస్తున్నప్పటికీ ఈ చిత్రానికి మాత్రం తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా బాణీలు సమకూర్చారు.

ఇక నిర్మాణ అంశాలకి వస్తే, నిర్మాతలు శిరీష-శ్రీధర అలాగే బన్నీ వాస్ లకి ప్రత్యేక అభినందనలు తెలపాలి. ఈ చిత్ర నిర్మాణలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మించడం వల్ల సినిమాకి మంచి గ్రాండ్ లుక్ వచ్చింది.   

ప్లస్ పాయింట్స్:

+ అల్లు అర్జున్
+ సంభాషణలు
+ సాయి కుమార్

ఆఖరి మాట:

బన్నీకి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS