ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: రామ్,  శ్రీ విష్ణు, అనుపమ, లావణ్య, ప్రియదర్శి, కిరీటి
నిర్మాణ సంస్థ: స్రవంతి సినీమ్యాటిక్స్ & PR మూవీస్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: కృష్ణ చైతన్య & రవి కిషోర్
రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల

యూజర్ రేటింగ్: 3.25/5  

ఫ్రెండ్షిప్ బాగుంది.. కాని కాస్త 'Slow' గా ఉంది.. 


నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కిషోర్ తిరుమల మరోసారి తనకి సూపర్ హిట్ ఇచ్చిన హీరో రామ్-సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తో కలిసి చేసిన మరో ప్రయత్నమే- ఉన్నది ఒకటే జిందగీ... మరి ఈ చిత్రం కూడా వారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రమంత హిట్ అవుతుందా లేదా అనేది ఈ క్రింద చూద్దాం..

కథ...

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అభి(రామ్)కి తన స్కూల్ లో వాసు (శ్రీ విష్ణు) పరిచయం అవుతాడు. వారి స్నేహం ఎంతలా ఉంటుందంటే, వాసుని వదిలిపెట్టాల్సి వస్తుంది అని బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళడం కూడా మానేసే అంతగా..  

అయితే వీరు పెరిగి పెద్దయ్యాక కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు. మళ్ళీ వీళ్ళిద్దరని కలపడానికి వీరి స్నేహితులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరికి హీరోయిన్ మహా (అనుపమ పరమేశ్వరన్) కి ఉన్న సంబంధమేంటి? వీరు విడిపోవడానికి కారణాలు ఏంటి? మ్యాగీ (లావణ్య) రావడంతో వీరి జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటి అనేది తెరపైనే చూడాలి..

నటీనటుల పనితీరు...

రామ్: అతనిలో నటుడుని మరోసారి దర్శకుడు బయటకి తీసాడు అనే చెప్పాలి. అభి అనే పాత్రలో చాలా సులువుగా, ఎనర్జిటిక్ గా నటించేశాడు. ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే పాత్రలో రామ్ ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి.

శ్రీ విష్ణు: కథ మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. రామ్ కి ప్రాణ స్నేహితుడి పాత్రలో శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు. రామ్ తో ఉండే సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు అనే చెప్పాలి.

అనుపమ పరమేశ్వరన్: మహా అనే మంచి అభినయాన్ని పలికించే అవకాశం ఉన్న పాత్ర లభించడం అనుపమకి అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈమె నటనకి వంక పెట్టె అవసరం లేకుండా నటించేసింది. పైగా తన సంబాషణలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి.

లావణ్య: ఈ సినిమాలో గ్లామర్ గర్ల్ పాత్ర పోషించినా సరే తనలోని యాక్టింగ్ ని కూడా ఎక్కడా తక్కువ చేయకుండా బాగా చేసింది అనే చెప్పాలి.

ఇక ఫ్రెండ్స్ బ్యాచ్ లో.. ప్రియదర్శి, కిరీటీ పాత్రలు ఒక్క కామెడీ నే కాకుండా మంచి ఎమోషన్స్ ని కూడా పండిస్తాయి. సెకండ్ హాఫ్ లో లావణ్య సహాయకురాలి పాత్ర అయిన ‘కానుక’ పండించిన హాస్యం ప్రేక్షకులని కడుప్పుబ్బా నవ్విస్తుంది.

విశ్లేషణ:

నేను శైలజ సినిమాతో ఒక మామూలు కథని అందంగా చూపించగలడు అన్న నమ్మకాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల. ఇక ఈ చిత్రం- ఉన్నదీ ఒకటే జిందగీ విషయానికి వస్తే, ఫ్రెండ్షిప్ ని ప్రధానంగా తీసుకొని అందులో ఒక అందమైన ప్రేమ కథని చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇందుకోసం తన పాత్రలకి న్యాయం చేసే సత్తా ఉన్న నటులని తీసుకోవడంలో మొదటి సక్సెస్ కొట్టేసాడు కిషోర్. ఇక మొదటి భాగం ఎంటర్టైన్మెంట్ బాగా ఉన్నా, రామ్-అనుపమల మధ్య సాగే సన్నివేశాలకి తన మార్కు సంబాషణలతో మనకి చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా అనుపమ-రామ్-శ్రీ విష్ణుల మధ్య జరిగే సన్నివేశం ఈ చిత్రం మొత్తంలో హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సన్నివేశాన్ని చాలా బాగా తీసాడు దర్శకుడు.

మొదటి భాగంతో పోలిస్తే, సెకండ్ హాఫ్ స్లో అయినట్టుఅనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తాయి. అయితే ఫ్రెండ్షిప్ ని బలంగా చూపెట్టాలి అని అనుకున్న దర్శకుడుకి కథనం కొద్దిగా స్లో అవ్వడం పెద్దగా గుర్తించలేదేమో.. ఏదైతేనేమి ఒక కమర్షియల్ చిత్రానికి కావాల్సిన ఇంటర్వెల్ ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉండడంతో ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తుంది అనే చెప్పాలి.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ & దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అదనపు ఆకర్షణ

ప్లస్ పాయింట్స్:

+ నటీనటులు
+ సంగీతం
+ లవ్ ప్రోపోజల్ సీన్
+ ఛాయాగ్రహణం
+ సంభాషణలు

మైనస్ పాయింట్:

- సినిమా స్లోగా అనిపిస్తుంది

చివరి మాట:

ఈ సినిమా ఫ్రెండ్స్ తోనే కాదు ఫ్యామిలీ తో కూడా చూడొచ్చు... సెకండ్ హాఫ్ కాస్త ఓపిక పడితే సినిమా బాగానే ఉంటుంది..

రివ్యూ: సందీప్


 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS