ఎన్టీఆర్ ని కాదని రానాకి ఓటేసిన బాలయ్య?!

మరిన్ని వార్తలు

బాలయ్య ఏమి చేసిన సంచలనమే.. ఆ విషయం ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెప్పాలా అని అనుకుంటున్నారా! అయితే ఈ క్రింద వార్తని ఒకసారి చదవండి.

వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు షో హిట్ అవ్వడంతో ఇప్పుడు విడుదల అవుతున్న ప్రతి తెలుగు చిత్రం తాలుకా నటీనటులు ఆ షోలో పాల్గొంటూ తమ చిత్రాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇదే వరుసలో బాలయ్య నటించిన పైసా వసూల్ చిత్రం ఇంకొక మూడు రోజుల్లో విడుదలకి సిద్ధం అవుతున్న వేళ ఆయన ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షోకి వెళతారా లేదా అన్నది చర్చనీయంశంగా మారింది.

ఇన్ని చర్చల నడుమ, బాలయ్య తన దర్శకుడైన పూరి జగన్నాధ్ తో కలిసి రానా హోస్ట్ చేస్తున్న No 1 Yaari షోకి వెళ్ళడం సంచలనం రేపింది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది.

ఎన్టీఆర్ ని లైట్ తీసుకోవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అభిప్రాయభేదాలే కారణం అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిల్లో నిజం ఉన్నా లేకపోయినా, బిగ్ బాస్ షోకి బాలయ్య వెళ్ళకపోవడం మాత్రం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS