ఎన్టీఆర్-త్రివిక్రమ్ లు ముహూర్తం పెట్టేశారు

మరిన్ని వార్తలు

వెండితెర పైన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు షోతో బుల్లితెరలో సైతం తన జెండా పాతేశాడు. టెలివిజన్ లో బిజీ అయినప్పటికీ, తను నటించే చిత్రాల జోరుని ఏమాత్రం కూడా తగ్గించలేదు.

జైలవకుశ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తవ్వగా, ఎన్టీఆర్ తన పాత్రలకి డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మొదలుపెట్టాడు. ఇదే ఊపులో తన తదుపరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఈ నవంబర్ లో మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇక త్రివిక్రమ్ కూడా పవన్ తో చేస్తున్న చిత్ర షూటింగ్ అక్టోబర్ తో పూర్తి చేసి, నవంబర్ నుండి ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు అని సమాచారం.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సంచలన కలయిక త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుండడం నందమూరి అభిమానుల్లో ఆనందం నింపనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS