ప్రదీప్ కి ఫైన్ పడుతుందా లేక జైలా?

మరిన్ని వార్తలు

యాంకర్ ప్రదీప్ నిన్న హైదరాబాద్ లో మద్యం తాగి కారు నడిపిన కేసులో చిక్కుకున్నాడు. ఈ తరుణంలో ఇప్పుడు ఆ కేసులో ఆయనకీ ఎటువంటి శిక్ష పడుతుంది అన్న చర్చ మొదలైంది.

అయితే రూల్స్ ప్రకారం, ప్రదీప్ కి ముందుగా ఆయన కుటుంబసభ్యులు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ట్రాఫిక్ నిబందనలు పాటించకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరిస్తారు. ఆ తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, ఇక అతనికి జైలు శిక్ష విదిస్తారా లేక ఫైన్ వేసి వదిలేస్తారా అన్నది జడ్జ్ చేతిలో ఉంటుంది. 

ఇక ప్రదీప్ కి బ్రీత్ టెస్ట్ చేశాక 178 పాయింట్స్ చూపెట్టగా, గతంలో ఈ మోతాదులో మద్యం సేవించి పట్టుబడిన నిందితులకి జైలు శిక్షలు పడిన ఉదాహరణలు ఉన్నాయి. దీనితో ఇప్పుడు ప్రదీప్ కి ఎటువంటి శిక్ష అనేది తెలాల్సివుంది.

మొత్తానికి ఈ డ్రంక్ & డ్రైవ్ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS