దగ్గుబాటి రానా మరో మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈసారి మెగా హీరోతో సినిమా చేయనున్నాడు.
వివరాల్లోకి వెళితే, రానా-వరుణ్ తేజ్ కలయికలో ఈ సినిమా రూపొందనుందట. ఇక ఈ చిత్రానికి తమిళ దర్శకుడు సల్మాన్ రాజ్ దర్శకత్వం వహించబోతున్నాడట. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ బాషలలో నిర్మితం అవుతుందట, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట.
ఇక ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ప్రకటన వెలువడనుంది. అయితే ఈ ఇద్దరు హైట్, బాడీ లు చూస్తే ఇది మరొక బాహుబలి చిత్రం కానుంది అని ఈ వార్త తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు.
మరి వీరు చేసేది మరో బాహుబలి అవుతుందా లేదా అన్నది తెలియాల్సిఉంది.