ఫిదా చిత్రం ఇటు ప్రేక్షకులతో పాటు అటు బాక్స్ ఆఫీస్ ని కూడా కలెక్షన్స్‌తో ఫిదా చేసేస్తుంది.
ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఫిదా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్నది. విడుదలైన వారం తరువాత ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 40 కోట్ల (గ్రాస్), రూ 23 కోట్ల (షేర్) పైగా వసూళ్లు సాదించింది.
ఫిదా చిత్రం ఇప్పటికి థియేటర్ల వద్ద స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. ప్రస్తుత కలెక్షన్స్ ని ఆధారం చేసుకొని ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం సుమారుగా రూ 60-70 కోట్ల గ్రాస్ ని చేరుకుంటుంది అని ఒక అంచనా!
ఇంతటి రేంజ్ కలెక్షన్స్ ని తాను కూడా మొదట్లో ఊహించలేదు అని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తనకి పూర్తీ సంతృప్తి ఇచ్చిన చిత్రంగా ఫిదా నిలిచిపోయింది అని ఆనందం వ్యక్తం చేశాడు.