ఫిబ్రవరి నెల మొదలవుతూనే మనం చెప్పుకున్నట్టుగా సినిమాల మీద సినిమాలు విడుదలవుతున్నాయి. పోయిన వారం మూడు చిత్రాలు విడుదలకాగా ఈ వారం కూడా మరో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
ఆ చిత్రాల టాక్ ఏంటి? వాటిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారు అన్నది ఈ క్రింద చూద్దాం..
మొదటగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన గాయత్రి చిత్రం గురించి చెప్పుకుందాము. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలైన రోజు నుండే ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రల గురించి ఆయన పలికిన సంభాషణల గురించిన చర్చ మొదలైంది. అయితే సినిమా విడుదలయ్యాక కూడా కథ కన్నా వేరే అంశాల కన్నా మోహన్ బాబు పాత్రలు ఆయన చెప్పిన డైలాగ్స్ కే ప్రేక్షకులు మొగ్గుచూపారు. మొత్తానికి ఈ సినిమా కి కేవలం ఆయన కోసమే వెళ్ళాలి అని అందరు అయితే అనుకుంటున్నారు.
ఇక రెండవ చిత్రం- ఇంటెలిజెంట్. వాస్తవంగా ఈ చిత్రం గురించి ఏమి చెప్పాలనుకున్నా అది వృధానే! ఎందుకంటే- వీవీ వినాయక్- సాయి ధరం తేజ్ కలయిక అనగానే ఎన్నో అంచనాలతో ధియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులకి ఈ సినిమా ఒక పీడకలగా మారింది అని చెప్పక తప్పదు. ఈ సినిమా కి మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్ రావడం గమనార్హం.
ఇక మూడవ చిత్రం తొలిప్రేమ- ఒక రోజు తరువాత విడుదలైనప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రమే ఈ వారం విజయవంతమైన చిత్రంగా నిలవనుంది. కారణం- దర్శకుడు, కథనం, హీరో, హీరోయిన్, ఛాయాగ్రహణం, సంగీతం ఇవన్ని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మనసుల్లోకి తీసుకెళ్ళేలా తోడ్పడ్డాయి. ఈ చిత్రం ప్రేక్షకుడికి ఒక చక్కటి అనుభూతిని కలిగించేదిలాగా ఉంది అనేది మాత్రం నిజం. మొదటి చిత్రమైనా వెంకీ చాలా బాగా దర్శకత్వం చేశాడు అలాగే రాశి ఖన్నా, వరుణ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు అని చెప్పొచ్చు..
ఇది... ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.